తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు. శనివారం చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. డా. చిరంజీవి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణ సాయం కింద రూ. 10 లక్షలు ఇప్పించారు.
'మంత్రి కేటీఆర్ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం' - Ktr help to doctor chiranjeevi
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి కేటీఆర్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.
'మంత్రి కేటీఆర్ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం'
డా. చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డా. చిరంజీవి పుట్టినరోజు కావడం, ఇదే రోజు ఆపదలో ఉన్న తమను మంత్రి కేటీఆర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేమన్నారు.
ఇదీ చదవండి:బిట్టు శ్రీను కస్టడీ కోసం మంథని కోర్టులో పోలీసుల పిటిషన్