తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Letter to Bandi Sanjay : 'ఎన్ని కొలువులు ఇచ్చారో లెక్క చెప్పే దమ్ముందా?' - KTR Comments on Bandi Sanjay

KTR Letter to Bandi Sanjay : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్​ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్​ది 'నిరుద్యోగ దీక్ష కాదు.. అవకాశవాద దీక్ష' అని విమర్శించారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో తెరాస చిత్తశుద్ధిపై కేటీఆర్​ లేఖ విడుదల చేశారు. ఉపాధి అవకాశాల్లో భాజపా వైఫల్యాలను ఎండగట్టారు. దేశ నిరుద్యోగ యువతకు భాజపా ఏం చేసిందో చెప్పాలన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న భాజపా హామీ ఏమైందని... ఎన్ని కొలువులు ఇచ్చారో లెక్క చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.

ktr open letter
ktr open letter

By

Published : Dec 26, 2021, 11:44 AM IST

KTR Letter to Bandi Sanjay : బండి సంజయ్​ది 'నిరుద్యోగ దీక్ష కాదు.. అవకాశవాద దీక్ష' అని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. బండి సంజయ్​ చేపట్టిన నిరుద్యోగ దీక్షపై కేటీఆర్​ బహిరంగ లేఖ రాశారు. ఉపాధి అవకాశాల్లో భాజపా వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్రం వల్ల రాష్ట్రానికి దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పాలని పేర్కొన్నారు. ఐటీఆఆర్​ ప్రాజెక్టును రద్దు చేసింది భాజపా కాదా అని ప్రశ్నించారు. యువతను నమ్మించి నట్టేట ముంచిన చరిత్ర కమలం పార్టీదేనంటూ ఆరోపించారు. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్న మంత్రి.. కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కల్పనలో తెరాస నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు భాజపాకు లేదని వ్యాఖ్యానించారు.

KTR Comments on Bandi Sanjay : నోట్ల రద్దు , జీఎస్టీ నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాల లెక్కలు చెప్పగలరా అని మంత్రి కేటీఆర్ భాజపాను ప్రశ్నించారు. బండి సంజయ్​కి నిరుద్యోగుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద దీక్ష చేపట్టాలన్నారు. కేంద్ర పరిధిలోని 15 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని వారి ప్రభుత్వాన్నే అడగాలని సూచించారు. కేంద్రంలో భాజపా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చరిత్రలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్లి, ఆర్థిక సంక్షోభంతోపాటు, మతసామరస్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. తెరాస పాలనలో లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని.. టీఎస్​ఐపాస్ విధానం ద్వారా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి సుమారు 16 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామని మంత్రి కేటీఆర్​ రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చామని.. ఇన్నోవేషన్, అంకుర పరిశ్రమల ఏర్పాటు ద్వారా లక్షల ఉద్యోగాలు సృష్టిస్తున్నామని తెలిపారు.

KTR Comments on BJP Latest : హైదరాబాద్​కు ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్​టైల్స్ పార్క్, మెడికల్ డివైజెస్ పార్కు వంటి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చినా కేంద్రం నుంచి ఒక్క రూపాయి అదనపు సాయం అందలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి హామీ ఇచ్చిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి హామీలను నెరవేర్చలేనదని.. బండి సంజయ్​కు నిబద్ధత ఉంటే కేంద్ర వైఫల్యాలపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:PIL IN TS High court : 'స్కూల్​ను సర్పంచ్ ఆక్రమించుకున్నారు.. చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details