నల్సార్ విశ్వవిద్యాలయం (NALSAR University)లో సీటు సంపాదించి అడ్మిషన్ కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతోన్న అనంతగిరి హరిప్రియ (Ananthagiri Haripriya)కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆర్థిక సహాయం అందజేశారు. నల్సార్ యూనివర్సిటీలో బీఏఎల్ఎల్బీ సీటు దక్కినా... కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక చేరలేకపోతున్నానని మంత్రి కేటీఆర్‌ను అనంతగిరి హరిప్రియ ట్విట్టర్ వేదికగా అభ్యర్థించింది.
సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ అవసరమైన సహాయం చేస్తానని హరిప్రియకు మాటిచ్చారు. సహాయాన్ని అర్థించిన 24 గంటల్లోనే అడ్మిషన్, అవసరమైన ఆర్థిక సహాయం చేసి మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారని హరిప్రియ పేర్కొన్నారు. తన విలువైన సమయాన్ని వెచ్చించి అడ్మిషన్ సమస్యను పరిష్కరించటమే కాక, ఆర్థిక సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.