సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Ktr)... రేపు పర్యటించనున్నారు. మధ్యాహ్నం సూర్యాపేటలో కర్నల్ సంతోశ్‌బాబు విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం పట్టణంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
Ktr Tour: రేపు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన - Minister KTR tour
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... రేపు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన
మధ్యాహ్నం 3.45కు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. కేతెపల్లి మండలం భీమారంలో రైతు వేదిక, వైకుంఠధామం, ఉన్నత పాఠశాల ప్రారంభిస్తారు. సాయంత్రం నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి, వెజ్ మార్కెట్ యార్డు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, వైకుంఠదామం, రైతు వేదిక ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: మంత్రి జగదీశ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు