తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కంప్యాక్టర్​ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్​ - hyderabad news

భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు హైదరాబాద్​లో రూపొందించిన 50 కంప్యాక్టర్​ వాహనాలను గురువారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్నారు. అనంతరం సంజీవయ్య పార్కు వద్ద ఆధునీకరించిన చెత్త తరలింపు కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నారు.

Minister KTR to launch compactor vehicles tomorrow
నేడు కంప్యాక్టర్​ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్​

By

Published : Nov 11, 2020, 9:06 PM IST

Updated : Nov 12, 2020, 3:53 AM IST

హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 50 కంప్యాక్టర్ వాహనాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ వాహనాల ద్వారా 15 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించనున్నారు.

నెక్లెస్ రోడ్ ఐమ్యాక్స్ సమీపంలోని మైదానంలో ఈ వాహనాలను మంత్రులు కేటీఆర్, మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్​లు కలిసి ప్రారంభిస్తారు. అనంతరం సంజీవయ్య పార్కు వద్ద ఆధునీకరించిన చెత్త తరలింపు కేంద్రాన్ని కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ఇవీ చూడండి: అధునాతన కమాండ్ కంట్రోల్.. నేరగాళ్ల గుండెల్లో గుబేల్​

Last Updated : Nov 12, 2020, 3:53 AM IST

ABOUT THE AUTHOR

...view details