హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన "హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి చేసే పాలన కావాలా..? ప్రజలను విభజించే పాలన కావాలా..? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి రాజకీయం కావాలా?.. విభజనవాదం కావాలా?: కేటీఆర్ - Minister KTR in Hushar Hyderabad with KTR program
హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. అభివృద్ధి రాజకీయం కావాలా?.. విభజనవాదం కావాలా? అని ప్రజలను తేల్చుకోవాలని సూచించారు.
అభివృద్ధి రాజకీయం కావాలా?.. విభజనవాదం కావాలా?: కేటీఆర్
అనేక భూ సమస్యలకు ధరణి ద్వారా పరిష్కారం లభించిందని ఈ సందర్భంగా తెలిపారు. ధరణి ద్వారా స్థిరాస్తులపై పౌరులకు హక్కులు లభిస్తాయని వెల్లడించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామని వివరించారు.
ఇదీ చూడండి: 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఎవరికీ అందలేదు: కేటీఆర్