తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2021, 7:55 PM IST

Updated : Oct 2, 2021, 8:06 PM IST

ETV Bharat / state

KTR: 30 డిజైన్లు, 20 రంగులు, 810 వెరైటీల్లో బతుకమ్మ చీరలు: కేటీఆర్​

నేతన్నలకు గౌరవప్రదమైన ఆదాయం కల్పించడం, తెలంగాణ పండగ బతుకమ్మ(bathukamma) పూట ఆడబిడ్డలకు చీరను అందించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి కేటీఆర్(minister ktr)​ వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ(bathukamma) చీర అందిస్తామని అన్నారు.

KTR: 30డిజైన్లు, 20 రంగులు, 810 వెరైటీల్లో బతుకమ్మ చీరలు: కేటీఆర్​
KTR: 30డిజైన్లు, 20 రంగులు, 810 వెరైటీల్లో బతుకమ్మ చీరలు: కేటీఆర్​

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చీరల పంపిణీ(bathukamma sarees distribution) ప్రారంభించినట్లు చేనేత, జౌళి శాఖా మంత్రి కేటీఆర్(minister ktr) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపీణీకి అవసరమైన చర్యలు తీసుకున్నామన్న మంత్రి... 18 ఏళ్లు నిండిన, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీర(bathukamma sarees) అందిస్తామని అన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన ఆదాయం కల్పించడం, తెలంగాణ పండగ బతుకమ్మ(bathukamma) పూట ఆడబిడ్డలకు చీరను అందించే ఉద్దేశంతో 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేటీఆర్ వివరించారు. ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా పవర్ లూమ్ కార్మికుల వేతనాలు రెట్టింపు అయ్యాయని తెలిపారు. సుమారు 20వేల మంది పవర్ లూమ్, నేత కార్మికులకు చేతి నిండా పని దొరికిందని అన్నారు.

చీరల ప్రాజెక్టుతో నేత కార్మికుల నైపుణ్యాన్ని పెంచగలిగామని.. వారిప్పుడు నూతన డిజైన్లు, వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పవర్ లూమ్ పరిశ్రమను మరింతగా వృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బలమైన అంశంగా మారిందని అన్నారు.

రూ.333.14కోట్ల ఖర్చు

మహిళా స్వయం సహాయక బృందాల మహిళల అభిప్రాయాలు తీసుకొని నిఫ్ట్ డిజైనర్లతో రూపొందించిన డిజైన్ పాటర్న్​లతో ఈసారి చేనేత, జౌళి శాఖ చీరలను సిద్ధం చేసిందని అన్నారు. 30 సరికొత్త డిజైన్లలో, 20 విభిన్న రంగులతో మొత్తం 810 రకాల చీరలను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. చీరలన్నీ జరీ అంచులతో, పూర్తిగా పాలిస్టర్ ఫిలిమెంట్, నూలుతో తయారు చేసినట్లు తెలిపారు. బతుకమ్మ చీరల కార్యక్రమం కోసం ఈ ఏడాది 333.14 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రారంభమైన చీరల పంపిణీ

బతుకమ్మ కానుకగా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరల పంపిణీ(bathukamma sarees distribution) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలకు చీరలు అందజేస్తున్నారు. బతుకమ్మ గొప్పతనాన్ని చాటిచెప్పేలా.. పండుగను సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని.... సనత్‌నగర్‌, బన్సీలాల్‌పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. మహిళలు సంతోషంగా పండుగ జరుపుకునేలా ప్రభుత్వమే చీరలు అందిస్తోందని... సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Huzurabad Bypoll:హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్​.. ఎవరంటే..?

Last Updated : Oct 2, 2021, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details