కొందరు అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌గా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ అల్లాపూర్‌లో మంత్రి రోడ్‌షోలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సెంచరీ కోల్పోయామని... ఈసారి జీహెచ్‌ఎంసీలో తెరాస శతకం పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
ఏది కావాలో మీ ఇష్టం...
అభివృద్ధి కావాలో ఆరాచకం కావాలో ఆలోచించుకోవాలని కేటీఆర్ అన్నారు. హిందు ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారన్నారు. గడిచిన ఆరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 67వేల కోట్ల అభివృద్ధి పనులను చేపట్టిందని వివరించారు.
ఆరున్నర లక్షల మందికి వరద సహాయం అందించామని మిగిలిన వారికి కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆరేళ్లలో ఒక్కటంటే ఒక్కపని కూడా చేయలేదని అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు.