పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు పరిశుభ్ర, ప్రణాళికాబద్ద పట్టణాలే లక్ష్యంగా పని చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. పురపాలక, పట్టణాభిృద్ధి శాఖ ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షించారు. దేశంలోనే అత్యధికంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించినందుకు అధికారులను మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరిన్ని అవార్డులు లక్ష్యంగా పని చేయాలని అన్నారు. శాఖ పరిధిలోని కార్యక్రమాలపై మంత్రి అధికారులతో చర్చించారు.
పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించాలి: కేటీఆర్ - పట్టణాల్లో మౌలిక అంశాలు
దేశంలోనే అత్యధికంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించినందుకు అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. పురపాలక, పట్టణాభిృద్ధి శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు పరిశుభ్ర, ప్రణాళికాబద్ద పట్టణాలే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగణంగా పని చేయాలన్న మంత్రి కేటీఆర్.. పది కార్యక్రమాలను పూర్తి చేయాలని చెప్పారు. ప్రజలకు మెరుగ్గా సత్వర సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, టీఎస్ బీ- పాస్ సహా అన్నింటి అమలు పకడ్బందీగా జరగాలని తెలిపారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ పనులపైనా మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని పట్టణాల్లోనూ మౌలిక వసతుల విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న ఆయన.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు.
ఇవీ చదవండి: