తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ఓపెన్ నాలాల మూసివేత: మంత్రి కేటీఆర్ - heavy rains in telangana

minister ktr review with ghmc officers on rains
వర్షాలు, వరదలపై అధికారులతో కేటీఆర్ సమీక్ష

By

Published : Sep 21, 2020, 2:01 PM IST

Updated : Sep 21, 2020, 4:42 PM IST

13:59 September 21

హైదరాబాద్​లో ఓపెన్ నాలాల మూసివేత: మంత్రి కేటీఆర్

వర్షాలు, వరదలపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ సహా అన్ని పురపాలికల్లో పరిస్థితులపై ఆరా తీశారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

రానున్న రెండు వారాలపాటు అధికారులకు సెలవులు రద్దు చేయాలని పేర్కొన్నారు. నిరంతరం క్షేత్రంలో ఉంటూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. గత 10 రోజుల్లోనే 54 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

భారీ వర్షంలోనూ సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు మరింత పెంచాలని చెప్పారు.

హైదరాబాద్ లోని ఓపెన్ నాలాల క్యాపింగ్ నిర్మాణానికి (బాక్స్ డ్రైనేజీల నిర్మాణం) పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్​లో రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాల పైన క్యాపింగ్ కార్యక్రమాలు పూర్తి చేయాలని.. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని... వీటన్నిటికీ త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సాధారణంగా 2 మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలన్ని కూడా జనసామర్థ్యం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. 

ఇలాంటి భారీ కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. రెండు మీటర్ల కన్నా వెడల్పు ఉన్న నాలాల పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఇలాంటి నాలాలకు గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం క్యాపింగు కుదరని నేపథ్యంలో వాటికి పకడ్బందీగా ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉందని అలాంటి కార్యక్రమాన్ని సైతం జీహెచ్ఎంసీ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే జీహెచ్ఎంసీ వద్ద అన్ని నాలాలకి సంబంధించిన సమాచారం ఉందని వీటితోపాటు నగరం విస్తరించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న నాలాల సమాచారం సేకరించాలని ఈ సందర్భంగా మంత్రి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్​లకు ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Sep 21, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details