ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన అన్ని పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో పనుల వారీగా ప్రగతిని సమీక్షించారు. మౌలిక వసతుల అభివృద్ధికి, సులభ రవాణాకు నిర్మిస్తున్న పైవంతెనలు, అండర్ పాస్‌లు, ఇతర పనులు ఏకకాలంలో చేసేందుకు అదనపు మెటీరియల్, మ్యాన్ పవర్, యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు.
ఎస్ఆర్డీపీ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష - minister ktr review on srdp
జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న ఎస్ఆర్డీపీ పనులపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రోజంతా పనులు జరిగేలా... అదనపు మెటీరియల్, ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని, మ్యాన్‌పవర్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఎస్ఆర్డీపీ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష
ప్రస్తుతం రోజుకు ఐదారు గంటలు మాత్రమే జరుగుతున్న పనులను 24 గంటలు కొనసాగించాలని కేటీఆర్ ఆదేశించారు. మూసీ, ట్రాఫిక్ డైవర్ట్ చేసేందుకు పోలీసుల అధికారులతో మాట్లాడాలని సూచించారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, డిస్కం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.