కొత్త పురపాలక చట్టం నిబంధనలకు అనుగుణంగా కొత్త జీహెచ్ఎంసీ చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు చట్టాన్ని మార్చనున్నట్లు వెల్లడించారు. బల్దియా ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో నూతన చట్టాన్ని సభ ముందుంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు.
కొత్త జీహెచ్ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష
జీహెచ్ఎంసీపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి పాల్గొన్నారు. నూతన పురపాలక చట్టం నిబంధనలతో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త జీహెచ్ఎంసీ చట్టాన్ని సభలో పెడతామని పేర్కొన్నారు.
నూతన చట్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, సేవల వేగవంతం, నాయకులపై బాధ్యత పెంచడం వంటి కీలకమైన అంశాలను... ఈ చట్టంలో పొందుపర్చాలని మంత్రి సూచించారు. పరిశుభ్రత, పచ్చదనానికి కొత్త చట్టంలో అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. హెఎండీఏ పరిధిలోని భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం అయ్యేలా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, పార్కుల నిర్వహాణ, జంక్షన్ల అభివృద్ది, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చదవండిఃఅవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు