రాజకీయాల్లోకి చిన్నారులను లాగొద్దని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, పనితీరు ఆధారంగానే ఉండాలని కేటీఆర్ సూచించారు.
దయచేసి వారిని రాజకీయాల్లోకి లాగొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
రాజకీయాల్లోకి చిన్నారులను లాగవద్దని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా తెరాస పార్టీ నేతలు, సోషల్ మీడియా వారియర్స్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, పనితీరు ఆధారంగానే ఉండాలన్నారు.
కేటీఆర్
టీఎస్టీఎస్ ఛైర్మన్ జగన్మోన్రావు చేసిన ఓ ట్వీట్ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి చిన్నారులను తీసుకురావద్దని కేటీఆర్ కోరారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లల ప్రస్తావన తీసుకురావద్దని పార్టీ నేతలు, సోషల్ మీడియా వారియర్స్‌కు సూచించారు.