పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు గ్రాడ్యుయేట్ ఓటర్గా తన పేరును నమోదు చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నేడు ప్రారంభమైన ఓటరు నమోదులో భాగంగా ఓటరు లిస్టులో మంత్రి తన పేరును నమోదు చేసుకున్నారు.
గ్రాడ్యుయేట్ ఓటర్గా పేరు నమోదు చేసుకున్న మంత్రి కేటీఆర్ - ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్గా మంత్రి కేటీఆర్
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2017 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటర్ లిస్టులో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఓటర్గా మంత్రి తన పేరును నమోదు చేసుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లు అంతా కచ్ఛితంగా తమ పేరుని ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్టు తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని.. ఈ నేపథ్యంలో గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2017 నవంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటర్ లిస్టులో తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులేనని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు.