KTR React to Hindenburg Report: అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూప్ స్టాక్‌ల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి..? ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారు? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలు ఇవి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్న విషయం తెలిసిందే.
Kavita reaction to the Hindenburg Report:స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు, షేర్ల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులపై ఆమె ట్విటర్ ద్వారా స్పందించారు. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.