Minister KTR Participated in Telangana Advocates Atmiya Sammelanam : కేసీఆర్ సింహం లాంటి వారని.. సింగిల్‌గా వస్తారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. తెలంగాణ సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించాలని.. మోదీ, రాహుల్ గాంధీ కాదని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో న్యాయవాదుల కోసం వైద్య బీమాను పెంచనున్నామని.. వారి సమస్యలన్నీ తీర్చే బాధ్యత తనదని మంత్రి కేటీఆర్ న్యాయవాదులకు హామీ ఇచ్చారు. అడ్వకేట్ ట్రస్ట్(Advocate Trust)ను రూ.500 కోట్లకు పెంచుతామని తెలిపారు.
Minister KTR Fires on Congress : అనంతరం ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన ఆయన.. కాంగ్రెస్‌లో సీఎంలు దొరికారు కానీ ఓటర్లు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. జానారెడ్డిపోటీ చేయరని.. కానీ ఆయనకు సీఎం పదవి కావాలని మండిపడ్డారు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం రిస్క్ తీసుకోవద్దని.. సొంత నిర్ణయాలు తీసుకునే నాయకుడు కాంగ్రెస్, బీజేపీల్లో లేరన్నారు. ఈ ఎన్నికల పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పోరాటాలు తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదన్నారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీతోనూ కొట్లాడామని గుర్తు చేశారు. ఆ తర్వాత సోనియాతోనూ.. ఇప్పుడు మోదీతో కొట్లాడుతున్నామన్నారు. తమకు రావాల్సిన హైకోర్టును రాకుండా ఐదేళ్లు సతాయించారని ఆరోపించారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు(Karnataka Current Issue) ఇస్తున్నామని డీకే శివకుమార్ అంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని.. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. కేసీఆర్ సింహం లాంటి వారని.. సింగిల్‌గానే వస్తారని స్పష్టం చేశారు.
KTR Respond to Election Schedule : 'తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. బీఆర్‌ఎస్‌దే..!'