హైదరాబాద్ నగర ప్రజల కోసం జలమండలి అమలు చేస్తున్న వన్ టైం సెటిల్మెంట్ను వినియోగించుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. జలమండలికి సక్రమంగా బిల్లులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
'వన్‌టైం సెటిల్మెంట్ను అందరూ వినియోగించుకోండి'
వన్‌టైం సెటిల్మెంట్ను అందరూ వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. పెండింగ్ ఉన్న నల్లా బిల్లులకు వడ్డీ మాఫీ చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ పథకం అమలులో ఉంటుంది కేటీఆర్ తెలిపారు.
'వన్‌టైం సెటిల్మెంట్ను అందరూ వినియోగించుకోండి'
జలమండలి వన్ టైం సెటిల్మెంట్ పథకం కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. జలమండలి బిల్లు బకాయిదారులకు సువర్ణావకాశం కల్పించిందని.. పెండింగ్‌లో ఉన్న నల్లా బిల్లుల వసూళ్ల కోసం వడ్డీ మాఫీ చేసినట్లు వెల్లడించారు. అసలు బిల్లు మాత్రమే చెల్లించాలని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు 45 రోజుల పాటు ఈ పథకం అమలులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.