తెరాస ఆశించిన విధంగా ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మరో 25 సీట్లు అదనంగా వస్తాయని ఆశించినట్లు ఆయన చెప్పారు. 10-12 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనట్లు వెల్లడించారు.
మరో 25 సీట్లు అదనంగా వస్తాయనుకున్నాం: కేటీఆర్ - Ghmc election results 2020
గ్రేటర్ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్ ఫలితాలు చూసి నిరాశ చెందనక్కర్లేదని సూచించారు.
మరో 25 సీట్లు అదనంగా వస్తాయనుకున్నాం: కేటీఆర్
గ్రేటర్ ఫలితాలు చూసి నిరాశ చెందనక్కర్లేదని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. బల్దియాలో అతిపెద్ద పార్టీగా తెరాస అవతరించినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలను విశ్లేషించుకుని ముందుకు వెళ్తామన్నారు. ఎన్నికల్లో శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేసిన సోషల్ మీడియా వారియర్స్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి:ఢీ అంటే ఢీ అంటున్న కారు, కమలం... పాతబస్తీలో పతంగి హవా
Last Updated : Dec 4, 2020, 9:03 PM IST