తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం.. భవిష్యత్తుపై దిశానిర్దేశం - KTR on ghmc elections

ktr
ktr

By

Published : Dec 6, 2020, 2:46 PM IST

Updated : Dec 6, 2020, 3:56 PM IST

14:45 December 06

తెలంగాణ భవన్‌లో కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ భేటీ

తెలంగాణ భవన్‌లో కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్‌ భేటీ

కొత్తగా ఎన్నికైన తెరాస కార్పొరేటర్లతో... పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులుగా రానున్న ఐదేళ్ల పాటు ప్రజలతో ఎలా మెలగాలో దిశానిర్దేశం చేస్తున్నారు. మేయర్ ఎంపికపై అవలంభించాల్సిన వైఖరిపై సమావేశంలో చర్చిస్తున్నారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెరాస ఎక్స్‌అఫిసియో ఓట్లతో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లలో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల కోసం... ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మేయర్ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా.... తెరాస తరఫున కార్పొరేటర్లుగా ఎన్నికైన 27 మంది మహిళల్లో ప్రధానంగా ఏడెనిమిదిమంది రేసులో ఉన్నారు.  

భారతీనగర్ డివిజన్‌లో గెలిచిన సింధురెడ్డి పేరు... ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. మాజీ మంత్రి పీజేఆర్​ కుమార్తె విజయరెడ్డి, చర్లపల్లి నుంచి ఎన్నికైన.... ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి, బంజారాహిల్స్ నుంచి మరోసారి కార్పొరేటర్‌గా ఎన్నికైన... తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Last Updated : Dec 6, 2020, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details