KTR Delhi tour latest updates : తెలంగాణలో అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టు అంశాలు గురించి కేంద్ర మంత్రులకు వివరించడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్.. ఇవాళ మరో ఇద్దరు కేంద్రమంత్రులను కలిశారు. ముందుగా పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరిని కలిశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరినట్లు సమాచారం.
KTR meet with Piyush Goyal : లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్ల మెట్రో లైన్‌కు ఆమోదం తెలిపి, నిధులు అందించాలని కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లింక్‌రోడ్లపనులకు సంబంధించి వివరాలు అందించి సాయం కోసం విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన కేటీఆర్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
గతంలో ఇచ్చిన ధాన్యం సేకరణ పరిమితిని రెట్టింపు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఉప్పుడు బియ్యం సేకరణ పరిమితిని కూడా పెంచాలని కోరారు. రాత్రి 10గంటల 15నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ కేటీఆర్ బృందం భేటీ కానుంది. హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధి హోంశాఖ పరిధిలోని భూముల కేటాయింపుపై విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.