తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐటీఐఆర్​ విషయంలో భాజపా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్​

దేశవ్యాప్తంగా ఐటీఐఆర్​ను పక్కకు పెట్టింది భాజపా ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ఐటీఐఆర్​ తీసుకొచ్చే దమ్ముందా అంటూ సవాల్​ విసిరారు. ఐటీఐఆర్ విషయంలో వెనక్కి పోయిన భాజపా నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఐటీఐఆర్​ విషయంలో భాజపా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్​
ఐటీఐఆర్​ విషయంలో భాజపా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్​

By

Published : Mar 3, 2021, 5:12 PM IST

హైదరాబాద్‌కు ఐటీఐఆర్తేలేని భాజపా.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్​ డిమాండ్​ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్​ను మూలకు పెట్టింది భాజపా ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు గతంలోనే విస్పష్టమైన ప్రకటన చేశారని... సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బెంగళూరు లాంటి పట్టణంలోనూ ఐటీఐఆర్ ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదన్నారు. బెంగళూరులో ఐటీఐఆర్ ప్రాజెక్టు రానందుకు కూడా తెరాస ప్రభుత్వమే కారణమా అంటూ ప్రశ్నించారు.

2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన డీపీఆర్​లను బండి సంజయ్​కి ఇస్తాం.. ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ము ఉందా అంటూ సవాల్​ విసిరారు. ఐటీఐఆర్ విషయంలో వెనక్కి పోయిన భాజపా.. నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ఒక ప్రకటన ఇప్పించాలన్నారు. బండి సంజయ్​కి దమ్ముంటే ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్​కి సమానమైన మరో ప్రాజెక్టును హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా... అని ప్రశ్నించారు. కేవలం మీడియాలో ప్రచారం కోసం అసత్యాలతో బండి సంజయ్ లేఖ రాశారని కేటీఆర్​ విమర్శించారు. బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర అంటూ ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: మహిళా ఔత్సాహికుల కోసం వీ-హబ్, మీషో ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details