తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగానే మంత్రి కేటీఆర్ జన్మ దినోత్సవ వేడుకలు - siricilla latest news

తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగానే నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందన్నారు.

నిరాడంబరంగానే మంత్రి కేటీఆర్ జన్మ దినోత్సవ వేడుకలు
నిరాడంబరంగానే మంత్రి కేటీఆర్ జన్మ దినోత్సవ వేడుకలు

By

Published : Jul 23, 2020, 11:05 PM IST

శుక్రవారం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిరాడంబరంగా.. సేవ కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి కేటీఆర్ విజన్ ఉన్న నేత అని.. కొద్ది కాలంలోనే రాజకీయాల్లో తానేంటో నిరూపించుకున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దేశంలో ఎంతో మంది యువకులకు రాజకీయ అవకాశాలు వచ్చినప్పటికీ.. కేటీఆర్​లా రాణించింది కొద్దిమంది మాత్రమేనన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

సిరిసిల్ల అభివృద్ధిపై సినీ నిర్మాత శ్రీనివాస్ గుప్తా రూపొందించిన 12 నిమిషాల లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్​లు బాల్క సుమన్, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : హోం ఐసోలేషన్​లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

ABOUT THE AUTHOR

...view details