రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గోషామహల్ నియోజకవర్గంలో పేదలకు నిత్యావసర సరుకులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గోషామహల్ నియోజకవర్గ తెరాస సీనియర్ నేత నందకిషోర్ బిలాల్ నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెయ్యి మంది నిరుపేదలకు నిత్యావసరాలు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా నిత్యావసరాల పంపిణీ
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో పేదలకు నిత్యావసర సరుకులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేశారు.
కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా నిత్యావసరాల పంపిణీ