తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం: కేటీఆర్ - హైదరాబాద్​లో సీఐఐ తెలంగాణ వార్షక సదస్సు

Minister KTR at CII Telangana Annual Conference: వ్యాపారాలు, పెట్టుబడులకు తెలంగాణలో అద్భుతమైన వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ వంటి సంస్థలు అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న మంత్రి.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు.

Minister KTR at CII Telangana Annual Conference
Minister KTR at CII Telangana Annual Conference

By

Published : Mar 7, 2023, 3:42 PM IST

Minister KTR at CII Telangana Annual Conference: సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో హైదరాబాద్​లో ప్రారంభమైంది. తొలిరోజు సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మళ్లీ మేమే అధికారంలో వస్తామని, మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. లైఫ్ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని.. వాటిని పార్మా దిగ్గజాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు: 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని వెల్లడించారు. 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయన్న కేటీఈర్.. 9 బిలియన్‌ టీకాలు హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే అవుతాయని పేర్కొన్నారు. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామన్నారు.

సుల్తాన్‌పూర్‌ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్‌ పార్క్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. లైఫ్‌ సైన్స్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్‌ అత్యుత్తమ వేదికగా మారిందని వివరించారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగిందన్న ఆయన.. ప్రైవేటుగా రాకెట్‌ లాంచింగ్ చేసిన స్కైరూట్‌ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి: ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలు ఏర్పాటు చేశాయని స్పష్టం చేశారు. అమెజాన్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్, అడోబ్‌ వంటి సంస్థలు ఇక్కడ అతిపెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నాయని గుర్తుచేశారు. విభిన్న కంపెనీలు మాత్రమే కాకుండా.. విభిన్నమైన ఆచారాలు, ఆహారం కూడా నగరంలో కనిపిస్తాయన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ముందుచూపుతో ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం భారత్‌లో న్యూక్లియస్‌గా మారుతోందని వివరించారు. భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా ఎంతో అనుకూలం కానుందని మంత్రి అన్నారు. తెలంగాణ పత్తికి దేశంలో మంచి డిమాండ్‌ ఏర్పడిందన్న మంత్రి.. టెక్స్​టైనల్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత పరిధి ఉంద్ననారు. భారీ స్థాయిలో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్‌ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ చుట్టూ ఉండే పరిశ్రమలకు నీటి సమస్య కూడా లేదని మంత్రి తెలిపారు.

'మళ్లీ మేమే అధికారంలో వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం. లైఫ్ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం. హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయి. 9 బిలియన్‌ టీకాలు హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే అవుతాయి. ఫార్మా పరిశ్రమలకు ఒకేచోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నాం. లైఫ్‌ సైన్స్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్‌ అత్యుత్తమ వేదికగా మారింది. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగింది'. -కేటీఆర్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం.. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తాం: కేటీఆర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details