మౌలిక వసతుల కల్పన కోసం(KTR on hyd roads), ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని... దానిని రుణంగా చూడవద్దని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్(minister ktr) తెలిపారు. హైదరాబాద్(hyderabad) మహానగరంలో ప్రజారవాణాను ప్రోత్సహిస్తూనే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అందుకోసం వేల కోట్ల రూపాయల వ్యయంతో పై వంతెనలు(fly overs), అండర్ పాస్(underpass)లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నగరంలో రూ. 2వేల కోట్లతో 22 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి(Assembly monsoon session) సమాధానమిచ్చారు.
రూ. 1545 కోట్ల వ్యయంతో చార్మినార్, సౌత్ జోన్ల పరిధిల్లో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. నగర వ్యాప్తంగా రోడ్లను కలిపేందుకు 132 లింక్ రోడ్లు పనులు చేపట్టినట్లు అందులో 24 పూర్తయినట్లు వివరించారు. పాత బస్తీలో త్వరలోనే పై వంతెన పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.