ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ బడ్జెట్ సమావేశాల్లో పేర్కొన్నారు. విదేశీ విద్యానిధి పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.
విదేశీ విద్య మిథ్య కాకుడదనే ఈ పథకం: మంత్రి కొప్పుల
విదేశీ విద్యానిధి పథకం విద్యార్థులకు ఒక వరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ సభలో వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం.. ఎందరో జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
విదేశీ విద్య అనేది మిథ్య కాకుడదనే ఈ పథకం: మంత్రి కొప్పుల
విదేశీ విద్య అనేది మిథ్య కాకుడదనే ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని సభలో వివరించారు. వెనుకబడిన జిల్లాల నుంచి సైతం విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఈ పథకం ఎంతో దోహదపడటంపై హర్షం వ్యక్తం చేశారు. విదేశీ విద్యా స్కాలర్షిప్ కోసం ఇప్పటివరకు 589 కోట్ల 69 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తాం : కేటీఆర్