తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం తరపున చర్యలు చేపట్టామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో పెద్ద, చిన్న చెరువులతో పాటు నీట మునిగిన కాలనీలను ఆయన పరిశీలించారు. మంత్రితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్రావు, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
రామాంతపూర్‌లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి - మేయర్ బొంతు రామ్మోహన్ వార్తలు
హైదరాబాద్ రామాంతపూర్‌లోని పెద్ద, చిన్న చెరువులతో పాటు నీట మునిగిన కాలనీలను మంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్రావు పరిశీలించారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి తెలిపారు.
రామాంతపూర్‌లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి
మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించినట్లు మంత్రి వివరించారు. తెలిసీ తెలీక నాలా పక్కన గృహాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందని మేయర్ రామ్మోహన్ అన్నారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని.. రామాంతపూర్ చిన్న, పెద్ద చెరువులకు శాశ్వత పరిష్కారానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు.
ఇవీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు