కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన అధికారికంగా విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరగబోయే తీవ్రవాద ప్రభావిత దేశాల హోం మంత్రుల సదస్సులో భారత్ నుంచి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తారు. ఆయన వెంట ఎస్‌బీ, ఎన్ఐఏ, రా, అంతర్గత మంత్రిత్వ ఉన్నతాధికారులు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. భారత్‌కు సంబంధించి నేరస్థులు, తీవ్రవాదుల అప్పగింత, అక్రమ చొరబాట్లు, తీవ్రవాద ప్రేరేపిత దేశాల నుంచి సంస్థలకు నిధుల ప్రవాహం, సైబర్ టెర్రరిజం వంటి అంశాలపై ఈ అంతర్జాతీయ సదస్సులో చర్చించనున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న నేపథ్యంలో 'నో మనీ-ఫర్ టెర్రరిజం' అనే థీమ్‌పై ఈ సదస్సు జరగనుందని ఆయన స్పష్టం చేశారు.
విదేశీ పర్యటనకు వెళ్లనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - ఆస్ట్రేలియా
ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న తీవ్రవాద ప్రభావిత దేశాల హోం మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు.
విదేశీ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కిషన్ రెడ్డి