తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ విషయంలో దేశంలోనే నంబర్‌ వన్​గా తెలంగాణ: ఇంద్రకరణ్ - minister indrakaran reddy live updates

మొక్కల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్​గా ఉందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 179 కోట్లకుపైగా మొక్కలు నాటామని వివరించారు. హరితహారంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

minister indrakaran reddy talk about forest area in telangana assembly sessions 2021
ఆ విషయంలో దేశంలోనే నంబర్‌ వన్​గా తెలంగాణ: ఇంద్రకరణ్

By

Published : Mar 22, 2021, 1:47 PM IST

అటవీ విస్తీర్ణంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెరాస సభ్యులు బాల్కసుమన్‌, రేఖా నాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

2 కోట్ల 77 లక్షల 10 వేల 412 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రం విస్తరించి ఉండగా.. అందులో 66 లక్షల 64 వేల 159 ఎకరాల్లో అటవీ క్షేత్రాలు ఉన్నాయని ఇంద్రకరణ్‌రెడ్డి సభకు వివరించారు. దేశంలో అటవీ విస్తీర్ణం.. 21.34 శాతం ఉండగా.. రాష్ట్రంలో అంతకుమించి 24.5 శాతం అడవులు ఉన్నాయని తెలిపారు. 35 శాతం అడవులు ఉండాలన్న లక్ష్యానికి అనుగుణంగా ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఆరు విడతల్లో 179 కోట్లకుపైగా మొక్కలు నాటామని.. అడవుల పునరుద్ధరణ ప్రక్రియ ద్వారా 38 కోట్ల మొక్కలకు పునరుజ్జీవం కల్పించామని ఇంద్రకరణ్‌రెడ్డి సభలో వెల్లడించారు.

ఆ విషయంలో దేశంలోనే నంబర్‌ వన్​గా తెలంగాణ: మంత్రి ఇంద్రకరణ్

ABOUT THE AUTHOR

...view details