Minister Harish Rao Speech in Assembly: అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో భాగంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బస్తీ దవాఖానాల గురించి మాట్లాడారు. బస్తీ దవాఖానాలు పేదల ప్రజలకు వరంగా మారాయని తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బస్తీ దవాఖానాలతో పేద ప్రజల సుస్తి నయమవుతోందని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1540 ఆశా కార్యకర్తల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలను కూడా బస్తీ దవాఖానాల్లో చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. బస్తీ దవాఖానాల వల్ల ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఫీవరాసుపత్రిపై ఔట్ పేషంట్ భారం తగ్గిందని చెప్పారు. మార్చి నెలాఖరు కల్లా 134 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. 158 రకాల మందులను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.