Minister Harish Rao latest comments : తెలంగాణ వైద్య సీట్ల పెంపులో సర్కారు మరో కీలక మైలురాయిని అందుకుందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ విభాగంలో దేశవ్యాప్తంగా 2118 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాగా అందులో 900 సీట్లు తెలంగాణ మెడికల్ కాలేజీలవే అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు.
ఇది ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మిగతా మెడికల్ కాలేజీలకు సైతం అనుమతులు వస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
- Telangana Diagnostics : తెలంగాణ డయాగ్నోస్టిక్స్.. అందుబాటులోకి 134 వైద్య పరీక్షలు
- Siddipet IT Hub Inauguration : 'తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి'
American Oncology Institute started Advance Surface Guidance System : సరైన ఆహారం తీసుకోవటం పట్ల ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని మంత్రి హరీశ్ రావు పిలిపునిచ్చారు. కలుషిత, పోషకాలు లేని ఆహారం తీసుకోవటం వల్ల ఇటీవల కాలంలో వ్యాధుల భారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో అత్యాధునికఏఐ టెక్నాలజీతో పనిచేసే అడ్వాన్డ్స్ సర్ఫేస్ గైడెన్స్ సిస్టంను మంత్రి ప్రారంభించారు.