తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రమే నిధులిస్తే.. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?' - మంత్రి హరీశ్​రావు తాజా వార్తలు

Minister Harish Rao: కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా లెక్కచేయడం లేదని మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన మొత్తం రూ.7,183 కోట్లు తక్షణం కేంద్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

'కేంద్రమే నిధులిస్తే మరి తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?'
'కేంద్రమే నిధులిస్తే మరి తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?'

By

Published : Apr 23, 2022, 4:13 PM IST

Updated : Apr 23, 2022, 4:24 PM IST

Minister Harish Rao: కేంద్రం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌.. ప్రధాని, కేంద్రమంత్రులకు అనేక లేఖలు రాశారన్నారు. కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా లెక్కచేయడం లేదని ఆయన ఆరోపించారు. చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులకు కేంద్రం కోత పెడుతోందన్నారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రిని అనేక సార్లు కోరామన్న మంత్రి... రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏపీ ఖాతాలో జమచేశారని మండిపడ్డారు. 13, 14, 15వ ఆర్థిక సంఘాల కింద రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. మొత్తం రూ.7,183 కోట్లు తక్షణం కేంద్రం విడుదల చేయాలని మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు.

రాష్ట్రానికి హైవేలు ఇచ్చామంటున్నారు.. టోల్‌ పెట్టి వసూలు చేయడం లేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రగతి పక్కన ఉన్న కర్ణాటకలో ఉందా?.. గద్వాలలో ఉన్న ప్రగతి రాయచూర్‌లో ఉందా? చెప్పాలంటూ భాజపా నాయకులను హరీశ్​రావు ప్రశ్నించారు. కర్ణాటకకు బండి సంజయ్‌ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానన్న మంత్రి... కేంద్రమే నిధులిస్తే మరి తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవని ప్రశ్నించారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి వంటి కార్యక్రమాలు దేశంలో ఎందుకు లేవంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు భాజపా నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. భాజపా నాయకులు చేయని దానిని చెప్పకుండా.. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చి మాట్లాడాలన్నారు. దేశంలో ఇంధన ధరలు, ఎరువుల ధరలు పెంచారు తప్పా.. ప్రజల ఆదాయాలను పెంచిన దాఖలాల్లేవని మంత్రి హరీశ్​ రావు అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్రలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో పాలకులు మాట్లాడిన మాటలు.. ఇవాళ భాజపా నేతలు మాట్లాడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధులు విడుదల చేయాలి: కేంద్రం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్‌.. ప్రధాని, కేంద్రమంత్రులకు అనేక లేఖలు రాశారు. కేంద్రం ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా లెక్కచేయడం లేదు. చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులకు కేంద్రం కోత పెడుతోంది. రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రిని అనేక సార్లు కోరా. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏపీ ఖాతాలో జమచేశారు.13, 14, 15వ ఆర్థిక సంఘాల కింద రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. మొత్తం రూ.7,183 కోట్లు తక్షణం కేంద్రం విడుదల చేయాలి.

-హరీశ్​రావు , రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

'కేంద్రమే నిధులిస్తే.. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?'

ఇవీ చదవండి:

Last Updated : Apr 23, 2022, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details