మంత్రి హరీశ్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని.. గోల్నాక కార్పొరేటర్ లావణ్య జీహెచ్ఎంసీలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మంత్రి ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆమె ఆకాంక్షించారు.
గోల్నాకలో ఘనంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు - golnaka corporator
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలను తెరాస నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, గోల్నాక కార్పొరేటర్ లావణ్య.. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
minister harish rao birthday celebrations
మంత్రి హరీశ్ రావు.. రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించి, నేడు బంగారు తెలంగాణ సాధనలోనూ నిర్విరామంగా పని చేస్తున్నారంటూ లావణ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Lock Down : సడలింపు సమయంలో కిటకిట.. లాక్డౌన్లో స్తబ్ధత