తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిచిన ధాన్యం సర్కారే కొంటుంది: గంగుల - పౌరసరఫరాల శాఖ మంత్రి

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను అప్రమత్తం చేశామని వెల్లడించారు.

తెలంగాణలో తడిచిన ధాన్యం మేమే కొంటాం
తెలంగాణ వార్తలు

By

Published : May 6, 2021, 6:50 PM IST

అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ సేకరించే 80 లక్షల టన్నులే కాకుండా ఎంత ధాన్యం వచ్చినా ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. అందుకోసం ఇప్పటి వరకు 7,183 కొనుగోలు కేంద్రాలు, 6,144 సెంటర్లు ఏర్పాటు చేశామని ప్రకటించారు.

ఇప్పటి వరకు 1.40 లక్షల మంది రైతుల నుంచి రూ.3,740 కోట్ల విలువైన 19.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మరో 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.15 వేల కోట్లను సీఎం కేసీఆర్​ చొరవతో ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించారని గుర్తు చేశారు.

ధాన్యం సేకరణ ప్రక్రియ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. కొవిడ్​ క్లిష్ట సమయంలోనూ క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల సిబ్బంది నిరంతరం అందుబాటులోనే ఉంటారని మంత్రి గంగుల వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details