బలహీనవర్గాల ముసుగులో ఉన్న పెద్దదొర ఈటల అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఈటల హుజూరాబాద్‌లో ఉంటే బీసీ.. హైదరాబాద్‌లో ఉంటే ఓసీ అని పేర్కొన్నారు. ఈటల ఎప్పుడైనా ముదిరాజుల సమస్యలపై మాట్లాడారా? అని ఆరోపించారు. బలహీనవర్గాల గురించి ఒక్కోరోజు కూడా ఈటల మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. ముదిరాజులకు చేప పిల్లలు కావాలని ఎప్పుడైనా సీఎంను కోరారా? అని వెల్లడించారు. హుజూరాబాద్‌లో తెలంగాణ వాదులను తొక్కిపెట్టారని అన్నారు. తక్కువ సమయంలో వేల కోట్లు ఎలా సంపాదించారని ఆరోపించారు.
ఎక్కడైనా తెరాస ఓడిపోతే ఈటల సంతోషించే వారు: గంగుల
మాజీ మంత్రి ఈటల వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగానే స్పందించారు. ఎక్కడైనా తెరాస ఓడిపోతే ఈటల సంతోషించేవారని ఆరోపించారు. ఆయన్ని కేసీఆర్.. ఓ సోదరుడిలా భావించి ఆదరించారని పేర్కొన్నారు.
ఈటలను సొంత సోదరిడిలా భావించి కేసీఆర్ ఆదరించారని తెలిపారు. పార్టీలో తిరుగుబాటు తెచ్చేందుకు ఈటల ప్రయత్నించారని మండిపడ్డారు. ఎక్కడైనా తెరాస ఓడిపోతే ఈటల సంతోషించే వారని చెప్పారు. హుజూరాబాద్‌లో తెరాస చాలా బలంగా ఉందని ఉద్ఘాటించారు. అక్కడ ఈటలను చూసి తెరాసను గెలిపించలేదని.. కేసీఆర్ ఫొటోను చూసే ప్రజలు ఓటేశారని స్పష్టం చేశారు. ఆ స్థానంలో ఈటల ఎన్నిసార్లు గెలిచినా కేసీఆర్‌దే ఘనత అన్నారు. కేసీఆర్ ఒక లెజెండ్.. ఒక శక్తి అని కొనియాడారు. త్వరలోనే హుజూరాబాద్‌లో పర్యటిస్తామన్నారు.