సామాజిక అసమానతల మీద జ్యోతిరావు పూలే అలుపెరగని పోరాటం చేశారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
'నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ స్టడీ సెంటర్లు' - బీసీ స్టడీ సెంటర్లు
జ్యోతిరావు పూలే అసలైన వారసుడు సీఎం కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. బీసీ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.
'నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ స్టడీ సెంటర్లు'
అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చాలా గొప్పదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ జ్యోతిరావు పూలే అసలైన వారసుడన్నారు. బీసీ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. దీనికోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పును 119 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి:జ్యోతిరావు పూలే ఆలోచన విధానమే మాకు స్ఫూర్తి: శ్రీనివాస్ గౌడ్