తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ యాప్​తో 33 రకాల వ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చు' - మంత్రి ఈటల రాజేందర్

కొవిడ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని బీఆర్కే భవన్‌ నుంచి మంత్రి ఈటల రాజేందర్​, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఐహెచ్‌ఐపీ యాప్ తెచ్చిన కేంద్రానికి ఈటల ధన్యవాదాలు తెలిపారు.

minister etela rajender, ihip app news
'ఆ యాప్​తో 33 రకాల వ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చు'

By

Published : Apr 5, 2021, 3:51 PM IST

వైరస్‌ వ్యాప్తిని గుర్తించేందుకు కేంద్రం తీసుకువచ్చిన ఐహెచ్‌ఐపీ యాప్‌ ఉపయోగపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కొవిడ్‌పై కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ నిర్వహించిన సమీక్షలో....హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌ నుంచి ఈటలతో పాటు అధికారులు పాల్గొన్నారు.

ఐహెచ్‌ఐపీ యాప్‌ తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2018 నుంచి యాప్‌ను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నామని.... అందుకు ఏఎన్​ఎమ్​లు, ల్యాబ్‌ టెక్నీషియన్లతో పాటు అధికారులకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. యాప్‌ ద్వారా సుమారు 33 రకాల అంటువ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చని ఈటల రాజేందర్‌ వివరించారు.

ఇదీ చూడండి :జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి : మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details