గతంలో గుర్తింపు లేకుండా ఉన్న కులాలకు ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పలు పార్టీలు సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. కోకాపేట్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ భవనం కేవలం కుల సంఘం మాత్రమే కాదన్నారు.
'కుల సంఘాలు ఐక్యంగా ఉండాలి' - మంత్రి గంగుల కమలాకర్
ఏ జాతి, కులం అయితే ఐక్యంగా ఉంటుందో అదే బాగుపడుతుందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ముదిరాజ్ భవనం ఆత్మగౌరవంగా ఉండబోతుందని పేర్కొన్నారు. ఏ ఒక్క కులం కాకుండా పూర్తి బీసీలు ఐక్యంగా ఉండాలని కేశవరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కోకాపేట్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన సందర్భంగా వారు పాల్గొన్నారు.
'కుల సంఘాలు ఐక్యంగా ఉండాలి'
గత ప్రభుత్వాలు వెనకబడిన కులాలను ఓటు బ్యాంకుగా మార్చుకున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఒక్కో కులానికి ఒక్కో భవనం కేటాయించిందన్నారు. రాబోయే రోజుల్లో ఇదోక వేదికగా మారుతుందని గంగుల అభిప్రాయం వ్యక్తం చేశారు. హక్కులు, సమస్యలు పరిష్కరించుకుని ఐక్యత పాటిద్దామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. బీసీలంతా ఐక్యంగా ఉండాలని కేకే కోరారు.
ఇదీ చూడండి :ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు
TAGGED:
మంత్రి ఈటల రాజేందర్