ప్రస్తుతం ఎక్కడా కొత్త ఆస్పత్రులను అప్గ్రేడ్ చేసే పరిస్థితి లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ కిట్ అనేది ఏదో అనాలోచితంగా పెట్టింది కాదని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అవసరాలను తీర్చడానికి పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను క్రమక్రమంగా బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు డాక్టర్లు, సిబ్బందని నియమిస్తున్నామని తెలిపారు.