రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని వస్తున్న వార్తలపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. అనేక వ్యాక్సిన్లు పరోక్షంగా తెలంగాణలోకి వస్తున్నాయని.. కొన్ని క్లినికల్ ట్రయల్స్ కోసం వస్తుండగా, మరికొన్నింటిని కొందరు తెలిసిన వాళ్ల ద్వారా తెచ్చుకుని వాడుతున్నారని ఆయన ఇవాళ హైదరాబాద్‌లో చెప్పారు.
కరోనా వ్యాక్సిన్‌పై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు
వ్యాక్సిన్ ముందుగానే వస్తే.. ఎవరికి ఇవ్వాలన్న దానిపై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు.
భారత్‌లో వ్యాక్సిన్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందని.. కేంద్ర ఆరోగ్య మంత్రిని వీడియో కాన్పరెన్స్‌లో తాము అడిగామన్నారు. అందుబాటులోకి వచ్చాక మొదట వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని సూచించామని ఆయన వివరించారు. ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్తాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను స్థానిక శాసన సభ్యుడు దానం నాగేందర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా చికిత్స అందిచేందుకు ఏర్పాటు చేసిన దవాఖానాలను ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు.
ఇవీచూడండి:కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృతి