పేదలకు వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో 106 సెంటర్లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత జీహెచ్ఎంసీదే అని స్పష్టం చేశారు. డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ నియమిస్తుందని అన్నారు. 270కి పైగా మందులు సమకూర్చినట్లు చెప్పారు.
పేదల కోసమే బస్తీ దవాఖానాలు: మంత్రి ఈటల - etala speech
పేదల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో అన్ని సదుపాయాలు అందిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పట్టణ పేదరికం అనేది అతి భయంకరమైనది మంత్రి పేర్కొన్నారు. బస్తీ దవాఖానాల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
etala rajendhar