తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్థానిక సంస్థల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ' - telangana assembly latest news

స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు నిధులు, విధులు కేటాయించేలా ఆలోచిస్తున్నామని శాసనమండలిలో మంత్రి వెల్లడించారు.

minister errabelli in assembly sessions
'స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

By

Published : Mar 11, 2020, 7:24 PM IST

స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు నిధులు, విధులు కేటాయించేలా ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీలకి నిధులు రావడంలేదని వివరించారు.

ఆర్థిక సంఘాలు గ్రామ పంచాయితీలకు కేటాయించడం వల్ల ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గ్రాంటులు రావడం లేదని మంత్రి తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాలను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

'స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

ఇదీ చూడండి:కరోనాపై ఆందోళన అవసరం లేదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details