బల్దియా ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసమే పని చేస్తోన్న తెరాసను ఆదరించాలని ప్రజలను కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాచారం డివిజన్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో తెరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ఇన్‌ఛార్జీలతో ఎన్నికల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
ఏనాడు ప్రజలను పట్టించుకోని భాజపా, కాంగ్రెస్‌లకు ఓటేయడం వల్ల ఎటువంటి లాభం లేదని మంత్రి చెప్పారు. అభివృద్ధికి బాటలు వేస్తోన్న తెరాసనే ఆదరించాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 100 సీట్లకు పైగా గెలిచితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.