ప్రజల ఆస్తులపై హక్కులతో పాటు వాటికి భద్రత కల్పించేందుకే రాష్ట్రంలోని ప్రతి కుటుంబ, నిర్మాణాల వివరాలు నమోదు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అప్పటి వరకు ప్రతి గ్రామంలోని నిర్మాణాలు, కుటుంబాల వివరాలన్నీ తప్పులకు తావులేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.
దసరాలోగా నిర్మాణాలన్నింటినీ నమోదు చేయాలి:ఎర్రబెల్లి
గ్రామపంచాయతీల పరిధిలోని నిర్మాణాలన్నింటినీ ఈనెల పదో తేదీలోగా నమోదు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియపై అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
దసరాలోగా నిర్మాణాలన్నింటినీ నమోదు చేయాలి:ఎర్రబెల్లి
ఇంటి యజమానుల నుంచి ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ కచ్చితంగా తీసుకోవాలని, ఒకవేళ యజమాని మరణిస్తే వారసుల పేరు మీద మ్యుటేషన్ చేయాలని స్పష్టం చేశారు. అధికారులందరూ వారి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దృశ్యమద్యమ సమీక్ష ద్వారా పలువురు అధికారులు, సర్పంచ్లతో మాట్లాడిన మంత్రి... రికార్డుల నమోదులో స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.
ఇదీ చూడండి:నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్