క్రీడలు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ప్రతినిత్యం రోగులకు సేవలందిస్తూ ఒత్తిడికి లోనవుతున్న వైద్యులకు ఈ క్రీడోత్సవాలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయని పేర్కొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం, ఉత్సాహం: మంత్రి ఈటల
నిమ్స్ వైద్యులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రోగులకు సేవలందిస్తూ ఒత్తిడికి లోనవుతున్న వైద్య సిబ్బందికి ఈ క్రీడోత్సవాలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయన్నారు.
నిమ్స్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న మంత్రి ఈటల
క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమన్నారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.
ఇవీ చూడండి: ఎన్నిక ఏదైనా తెరాసదే విజయం: బాల్క సుమన్