వైద్యో నారాయణ హరి అనే స్థితి నుంచి వైద్యులపై దాడి చేసే పరిస్థితి వచ్చిందని... సమాజంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన సమయం వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్ అకాడమీ వైద్య రత్న, సేవారత్న అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వారిని ఘనంగా సన్మానించారు. జ్ఞానవంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం తెరాస ఎంతగానో కృషి చేస్తోందని వివరించారు. వైద్యులు, మేధావులు సమాజ వికాసానికి తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి ఈటల వెల్లడించారు.
మానవ సంపద చాలా గొప్పది: మంత్రి ఈటల - ఈటల
'మానవ సంపద చాలా గొప్పది. అది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే... కావాల్సింది వైద్యులు. వారు చేసే సేవ వల్లే ఈ రోజు అందరూ ఆనందంగా జీవించగలుగుతున్నారు': ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
మానవ సంపద చాలా గొప్పది: ఈటల