తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్​లో నూతన ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల - Nims

హైదరాబాద్ నిమ్స్​లో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన నూతన ల్యాబ్​ను మంత్రి ఈటల రాజేందర్​ ప్రారంభించారు. ఇక్కడికి వచ్చిన రోగులకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఔట్ పేషెంట్​ బ్లాక్​ను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.

నిమ్స్​లో నూతన ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల

By

Published : Jul 1, 2019, 5:10 PM IST

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో త్వరలో ఔట్ పేషెంట్​ బ్లాక్​ను మరింత విస్తరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన నూతన ల్యాబ్​ను ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు బయటకు వెళ్లకుండా అన్ని రకాల వైద్యం ఇక్కడే అందిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందించేందుకు నిధులు కేటాయించి భవనాలు ఆధునీకరిస్తామన్నారు. రోగుల సంఖ్య పెరగడం వల్ల బెడ్స్ కొరత ఏర్పడిందని ఈ ఇబ్బందిని త్వరలో పరిష్కరిస్తామన్నారు.

నిమ్స్​లో నూతన ల్యాబ్​ను ప్రారంభించిన మంత్రి ఈటల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details