విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుండడం వల్ల వారందరినీ క్వారంటైన్లో ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లపై మంత్రి ఈటల రాజేందర్ చర్చించారు. సచివాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, చికిత్సపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌కి మంత్రి సూచించారు.
క్వారంటైన్లో సకల ఏర్పాట్లు: మంత్రి ఈటల - కరోనాపై మంత్రి ఈటల సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, చికిత్సపై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
'విదేశీయులను క్వారంటైన్లో ఉంచేందుకు ఏర్పాట్లు'
ఎంత మంది పేషంట్స్ వచ్చినా.. చికిత్స అందించేందుకు కావాల్సిన ప్రణాళిక సిద్ధంగా ఉంచాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే వైరస్ ఉందని.. ఇక్కడ ఉన్నవారికి సోకకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఇది కొనసాగించాలంటే విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు ఈటల తెలిపారు.
ఇవీ చూడండి:సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్