ఏపీలోని విశాఖ జిల్లా ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గోపాల్ చెక్కిన కళాఖండం పలువురిని ఆకట్టుకుంటోంది. ఉగాది పండుగను పురస్కరించుకొని.. సబ్బుపై మామిడికాయలు, కొమ్మలు, పూర్ణకుంభాన్ని చక్కగా చెక్కాడు. కింద భాగంలో ఉగాది శుభాకాంక్షలు అంటూ తెలుగులో చెక్కిన కళాకృతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
సబ్బుపై చెక్కిన ఉగాది కళాకృతి.. చూద్దాం రండి - Visakha miniature artist Gopal latest pictures
ఉగాది పురస్కరించుకొని.. ఏపీలోని విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గోపాల్.. సబ్బుపై చెక్కిన కళాఖండం ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కళాఖండం ఉంది.
సబ్బు
పండగలు, స్వాతంత్ర సమరయోధుల జయంతి, వర్ధంతి.. ఇలా వివిధ సందర్భాలలో.. సూక్ష్మ కళాఖండాలను సబ్బులు, శుద్ధముక్కలపై తయారుచేసి మన్ననలు పొందుతున్నాడు గోపాల్.
ఇదీ చదవండి:ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మాదే: కేటీఆర్