తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణంగా నిలిచింది'

కరోనా సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగానే నేడు ప్రపంచ దేశాలన్ని భారత్‌వైపు చూస్తున్నాయని హిమాచల్‌ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రైవేట్‌ హాస్పిటల్‌ బాధితుల సంఘం 5వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ కరోనా వారియర్స్‌కు సన్మానం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

mimachal-pradesh-governer-bandaru-dattatreya-honors-kovid-warriors
'ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణంగా నిలిచింది'

By

Published : Mar 3, 2021, 12:06 PM IST

కొవిడ్‌ నియంత్రణలో భారత్‌ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచిందని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రైవేట్‌ హాస్పిటల్‌ బాధితుల సంఘం 5వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ కరోనా వారియర్స్‌కి సన్మానం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహమ్మారి విస్తరిస్తోన్న సమయంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా రోగులకు సేవలందించిన పలువురు వైద్యులను, పాత్రికేయులను ఆయన ఘనంగా సత్కరించారు.

ఒకప్పుడు ప్రపంచ దేశాలు అమెరికా, రష్యాల వైపు చూసేవని.. కరోనా అనంతరం భారత్‌ను ఒక ఆశాకిరణంగా చూస్తున్నాయని గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి ప్రధాని మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రపంచాన్ని మన వైపు చూసేలా చేశాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతో పాటు దేశ ప్రజల క్రమశిక్షణ కారణంగానే నేడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకం అయ్యామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌, ప్రైవేట్‌ హాస్పిటల్‌ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'కుటుంబం కాదనుకుంటే...'గాంధీ' అక్కున చేర్చుకుంది'

ABOUT THE AUTHOR

...view details